Widgets


డోలే డోలే దిల్ జరజరా song from Pokiri


డోలే డోలే దిల్ జరజరా
నిను ఓర ఓర గని నరవరా
జాగుమాని చేయి కలపరా
జతచేరి నేడు జతి జరుపరా
జర జల్ది జల్ది పెందలకడనే రారా
ఒడి అంతరంగ సంభరమునకే రారా
రాలుగాయవే రసికుడా
కసికోక లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడా
నిశికేళి వేళ జతచోరా
చలేగా చలేగా ఏ హై ఇష్క్ కా జమానా
కరేగా కరేగా హర్ దిల్ కో దివానా (2)

అనువుగ అందిస్తా సొగసుని సంధిస్తా
ఒదుగుతు కుదురుగ నీలోనా
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
దిలుబరు దేఖోనా
మిసమిసకన్నే కొసరకు వన్నె వలపుతో వల పన్నీ
నఖశిఖలన్ని నలుగును కన్నె కలబడు సమయాన్నీ
ఒడికి త్వరగా భరిలో కరగా
ఒడికి త్వరగా ఓ.. భరిలో కరగా

కిటుకుని విప్పేస్తా చెమటని రప్పిస్తా
తళుకుతో తెగబడి నీపైనా
చటుకున చుంబిస్తా చనువుగా బంధిస్తా
సున్ మేరా దీవానా
తొలితెరలన్ని గడుసరి కన్నె తొలగును తమకాన్నీ
కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలికొను తరుణాన్నీ
తరలి దరికే ఎగసి యదకే
తరలి దరికే హొ.. ఎగసి యదకే



జర జల్ది జల్ది పెందలకడనే రారా
ఒడి అంతరంగ సంభరమునకే రారా
రాలుగాయవే రసికుడా
కసికోక లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడా
నిశికేళి వేళ జతచోరా
చలేగా చలేగా ఏ హై ఇష్క్ కా జమానా
కరేగా కరేగా హర్ దిల్ కో దివానా (2)

To listen this song click on play button
                                                

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory