Widgets


చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా song from Rudraveena


చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానియ్యకు వ్యర్థం
సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానియ్యకు వ్యర్థం
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సాంప్రదాయమంటే
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సాంప్రదాయమంటే
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా
తెప్ప తగలబెట్టేస్తావా యేరు దాటగానే
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా
తెప్ప తగలబెట్టేస్తావా యేరు దాటగానే
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానియ్యకు వ్యర్థం
చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory