కయ్యాలమారి పడతావే జారి
పాతాళం కనిపెట్టేలా.. ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతి లేని సుందరి
గోపాలబాలా ఆపర ఈ గోల
ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా
మైకంలో మయ సభ చూడు.. మహరాజా రాణా తోడు
సాగనీ మరి సరసాల గారడి
కొండలు గుట్టలు చిందులాడే తధికినతోం
వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం
తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నక్కుదాం
ఊదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం
చూడమ్మో… హంగామా…
అడివంతా రంగేద్దాము.. సాగించే వెరైటీ ప్రోగ్రాం
కళ్ళ విందుగా పైత్యాల పండగ
ఆ.. కన్యాకుమారీ కనపడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
మైకంలో మయ సభ చూడు.. మహరాజా రాణా తోడు
సాగనీ మరి సరసాల గారడి
డేగతో ఈగలే ఫైటు చేసే చెడుగుడులో
చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో
నేలమ్మా తప్ప తాగెనో ఏ మూల తప్పిపోయనో
మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో
ఓయమ్మో… మాయమ్మో…
దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం
ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా
గోపాలబాలా ఆపరా ఈ గోల
ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా
పాతాళం కనిపెట్టేలా.. ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతి లేని సుందరీ
ఆ.. సాగనీ మరి సరసాల గారడి







0 comments:
Post a Comment