Widgets

ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా song from Bobby

ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా
తన చనుబాలతొ పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లొడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి నరం
ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా

శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం
మానవలికే వైతాలిక గీతం రా భారతం
ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం
ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం
ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా
మనమేమిస్తే తీరేను ఆ రుణమురా ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా
భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిదిచాలురా
వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి నరం
ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా

పిచ్చి కుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా
మంచు మల్లెల శాంతి కపోతం నెత్తుటి తడిలో తడిసినా
చెక్కుచదరని ఐకమత్యమొకటే సవాలురా
మానవుడే మా వేదం మానవతే సందేశం
మా శతకోటి హృదయాలదొక మాటరా ఉక్కు పిడికిలితో అణిచేము మీ బలుపురా
చావు ఎదురైన భయపడదు మా గుండెరా
శత్రువెవడైన తలవంచది ఈ జెండరా ఫిరంగుల్ని ఎదిరించి తొడకొట్టి నిలిచిందిరా
వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి నరం
ఈ జెండ పసి బోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా
తన చనుబాలతొ పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లొడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి నరం
To listen this song click on play button

0 comments:

Post a Comment

LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory