
సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా
నా కథలో నాయకుడా నా మదిలో మన్మధుడా
నువ్వు పెనవేస్తే శృంగారవీణ పదే పదే మోగాలా
కలవా చెలి కానుకవా మదినే గిచ్చే మల్లికవా
కన్నె వన్నె చూసి కలుగు భావమేది
కళ్ళలోన ప్రేమా? కామమా? ఏదీ ఏదీ
కమ్మనైన స్నేహం గుండె నిండుతుంటే
కాలమంత వెలిగే బంధమే అది అదీ
ఆ మాటే చాలంట నీ మనసుకి బానిసనవుతా
నీ xxx నేనేస్తా నీ శ్వాసై నిత్యం నిన్నే ప్రేమిస్తా
రాయి వంటి నాలో రాగాలొలికినావే
రాయభారమింకా ఎందుకే అహొ ప్రియా ప్రియా
వేసవంటి నేను వెన్నెలైన వేళా
హాయి భారం తీరేటందుకే మహాశయా
నీ జోరే సెలయేరై నను నీలో ముంచెయ్యలా
నీ జ్వాలే నా చీరై నా తనువే కాగి రేగిపోవాలా
సకల కళా వల్లభుడా సరసం కోరే స్నేహితుడా
నా కథలో నాయకుడా నా మదిలో మన్మధుడా
నను ఒడిచేర్చి నిను పంచువేళ ప్రాయం ప్రాణం ఊగాలా







0 comments:
Post a Comment