మనకేలాగోల మందార మాల మాపటేళ
ఓహొ పిల్లా.. సుభానల్లా..
సరాగంలో.. విరాగాలా..
మిస మిస వయసు రుస రుసల దరువుల
గుస గుస తెలిసె కలికి చిలకా
కసి కసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనక
ఓహొ లైల ఓ చారుశీలా కోపమేల
మనకేలాగోల మందార మాల మాపటేళ
విశాఖలో నువ్వూ నేను వసంతమే ఆడాల
హుషారుగా చిన్నా పెద్దా షికారులే చెయ్యాల
వివాహపు పొద్దుల్లోనే వివాదమా ఓ బాలా
వరించిన వలపుల్లోనే విరించిలా రాయాల
అందచందాల అతివల్లోన కోపమే రూపమా
కోపతాపాల మగువల్లోన తప్పని తాళమా
చాల్లే బాల నీ చ చ చీ ల సంధ్యారాగాలాపన
ఓహొ లైల ఓ చారుశీలా కోపమేల
మనకేలాగోల మందార మాల మాపటేళ
ఓహొ పిల్లా.. సుభానల్లా..
సరాగంలో.. విరాగాలా..
మిస మిస వయసు రుస రుసల దరువుల
గుస గుస తెలిసె కలికి చిలకా
కసి కసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనక
జపించినా మంత్రం నీదే తపించినా స్నేహంలో
ప్రపంచము స్వర్గం నీవే స్మరించిన ప్రేమల్లో
చెలీ సఖీ అంటూ నీకై జ్వలించిన ప్రాణంలో
ఇవీ కథా అన్నీ తెలిసి క్షమించవే ప్రాయంతో
కాళ్ళ భేరాలకొచ్చాకైనా కాకలే తీరవా
పేరు మార్చేసి పాహీ అన్నా కేకలే ఆపవా
పోవే బాల చాలించు గోల ప్రేమిస్తున్నా ఘాటుగా
ఓహొ లైల ఓ చారుశీలా కోపమేల
మనకేలాగోల మందార మాల మాపటేళ
ఓహొ పిల్లా.. సుభానల్లా..
సరాగంలో.. విరాగాలా..
అరె మిస మిస వయసు రుస రుసల దరువుల
గుస గుస తెలిసె కలికి చిలకా
కసి కసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనక
ఓహొ లైల ఓ చారుశీలా కోపమేల
మనకేలాగోల మందార మాల మాపటేళ







0 comments:
Post a Comment