చిటికెడు నడుమే వయ్యారం
చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం
బావా బావా బంగారం
అతిగా నాన్చకు యవ్వారం
ఈ పూటైన తీర్చేయివా నా భారం
ఓ చెలి అరే ఎలా ఉడికించకే కథే ఇలా
చాటుగా అది ఇది మర్యాద
రా ప్రియా అదేంటలా అరిటాకులా మరీ అలా
గాలివాటుకే ఇలా భయమేలా
చెలియా చెలియా సింగారం
చిటికెడు నడుమే వయ్యారం
చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం
సోకులను ఆరేసి నా మదికి వల వేసి
లాగకిక వన్నెల వయ్యారీ..
కోరికలు రాజేసి పోక నను వదిలేసి
నాకు ఇక తప్పదు గోదారీ..
ముగ్గుల్లో దించొద్దు మున్నేట ముంచొద్దు
అమ్మమ్మ నిన్నింక నమ్మేదెలా
ముద్దుల్లొ ముంచెత్తి నా మొక్కు చెల్లించు
ముద్దాయిలా నువ్వు కూర్చోకలా
వాగల్లే వస్తావు వాటేసుకుంటావు
చీ పాడు సిగ్గంటే లేదే ఎలా
దూరంగ ఉంటూనే నన్నల్లుకుంటావు
ఏ మాయో చెప్పేదెలా
మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచి
పెట్టకిక నాతో ఈ పేచీ..
కాముడికి కసి రెచ్చి కౌగిలికి సెగలిచ్చి
ఆడనెట మనతో దోబూచీ..
అబ్బబ్బ అబ్బాయి జబ్బాల బుజ్జాయి
ఎన్నెన్ని పాఠాలు నేర్పాలిలా
అందాల అమ్మాయి మోగిస్త సన్నాయి
అందాక హద్దుల్లో ఉండాలలా
కల్లోకి వస్తావు కంగారు పెడతావు
నాకర్ధమే కాదు నీ వాలకం
ఒళ్ళోన ఉంటేను ఊరంత చూస్తావు
అయ్యాగ నీలో సగం
హే.. చెలియా చెలియా సింగారం
చిటికెడు నడుమే వయ్యారం
చూపులతోనే తియ్యొద్దే నా ప్రాణం
బావా బావా బంగారం
అతిగా నాన్చకు యవ్వారం
ఈ పూటైన తీర్చేయివా నా భారం







0 comments:
Post a Comment