అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్నా
అయ్యయ్యో అంటారేమో గానీ మనసా.. తెలుసా
పడవలసిందేగా నువిలా నానా హింస
ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే (2)
ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసితెలియని పసి మనసా
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
మునుపేనాడూ ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాలా
వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్లా
ఎందుకివ్వాళె ఇంత మత్తెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా
అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలేసావా
గుండెల గుమ్మందాటి వస్తుంటే చూస్తున్నావా
అటు చూడకు అన్నానా మాటాడకు అన్నానా ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
ఏ దారైనా ఏ వేళైనా ఎదురవుతుంటే నేరం తనదేనా
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు యద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేంచెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే
కనకే నాకీకోపం కన్నెగా పుట్టిన నా మేదే
ధీం తాన నాహీరే ధీం ధీం తాన నాహీరే (4)







0 comments:
Post a Comment