Widgets


శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో song frm Naayak

 

శుభలేఖ  రాసుకున్న  ఎదలో  ఎపుడో.. అది  మీకు  పంపుకున్న  అపుడే  కలలో.. పుష్యమి  పువ్వుల  పూజ  చేస్తా  బుగ్గన  చుక్కలతో.. ఒత్తిడి  వలపుల  గంధమిస్తా.. పక్కలలో శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో.. తొలిముద్దు  జాబు  రాశా  చెలికే  ఎప్పుడో.. శారద  మల్లెల  పూలజల్లే  వెన్నెల  నవ్వులలో శ్రావణ  సంద్యను  రంగరిస్తా  కన్నులతో శుభలేఖ  రాసుకున్న  ఎదలో  ఎపుడో.. తొలిముద్దు  జాబు  రాశా  చెలికే  ఎప్పుడో

చరణం 1:
చైత్రమాసమొచ్చెనేమో  చిత్రమైన  ప్రేమకి?? కోయిలమ్మ  కూసెనేమో  గొంతునిచ్చి  కొమ్మకి.. మత్తుగాలి  వీచెనేమో  మాయదారి  చూపుకి.. మల్లెమబ్బు  లాడెనేమో  బాలనీలవేణికి మెచ్చి  మెచ్చి  చూడసాగే  గుచ్చే  కన్నులు.. గుచ్చి  గుచ్చి  కౌగిలించే  నచ్చే  వన్నెలు.. అంతేలే,  కథ  అంతేలే,  అదంతేలే శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో.. తొలిముద్దు  జాబు  రాశా  చెలికే  ఎప్పుడో..
  పుష్యమి  పువ్వుల  పూజ  చేస్తా  బుగ్గన  చుక్కలతో.. ఒత్తిడి వలపుల  గంధమిస్తా.. పక్కలలో శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో.. శుభలేఖ  రాసుకున్న  ఎదలో  ఎపుడో..

చరణం 2:

హంసలేఖ  పంపలేక  హింస  పడ్డ  ప్రేమకి.. ప్రేమలేఖ  రాసుకున్నా  పెదవి  రాని  మాటతో.. రాధలాగ  మూగబోయా  పొన్న చెట్టు నీడలో.. వేసవల్లె  వేచివున్నా  వేణుపూల  తోటలో వాలుచూపు  మోసుకొచ్చే  ఎన్నో  వార్తలు.. ఒళ్ళో  దాటి  వెళ్ళ  సాగేఎన్నో  వాంఛలు.. అంతేలే,  కథ  అంతేలే,  అదంతేలే
 శుభలేఖ  రాసుకున్న  ఎదలో  ఎపుడో.. అది  మీకు  పంపుకున్న  అపుడే  కలలో.. శారద  మల్లెల  పూలజల్లే  వెన్నెల  నవ్వులలో శ్రావణ  సంద్యను  రంగరిస్తా  కన్నులతో 
శుభలేఖ  రాసుకున్న  ఎదలో  ఎపుడో.. శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో..


0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory