చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువ
వయసా తెలుసా యదలో తెగువ
తెలిసి అలుసా చెబితే వినవా
కనులే తెరచి మనసా కనవా
లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా
రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా
ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా (2)
ఊహలను అణిచి అణిచి చెరలో పెడితే ఎలా
గాలి మరి గదిలో ఆగేనా…
కన్నుల్లే కలనే కాదంటే
కంటికే లోటు లేదంటే…
ఆశకి విలువే లేదంటే
గుండెలో చోటే లేదంటే
వింత కాదా ఈ గొడవా
లేరా లేరా లేరా ఊప్పెనలా ఉరికెయ్యాలా
రారా రారా రారా అందరిలో చిందెయ్యాలా
ఊప్పెనలా ఉరికెయ్యాలా రారా రారా
జాబిలికి తెలియదులేరా వెన్నెలలో తన విలువ
చీకటికే తెలుసునులేరా జాబిలిలో తొలి చలువ
వాన కథ తెలుసా మనసా చినుకే వరదై ఇలా
ఆఖరికి నదిలో చేరాలా…
నేలతో పని లేదనుకుంటే
నింగికి నిదురే ఉంటుందా…
గాలితో పని లేదంకుంటే
గుండెకి కుదురే ఉంటుందా
వింత కాదా ఈ గొడవా
లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా
రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా
ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా
లేరా లేరా లేరా ఊహల్లో ఉరికెయ్యాలా
రారా రారా రారా సింగంలా చిందెయ్యాలా
ఊహల్లో ఉరికెయ్యాలా రారా రారా








0 comments:
Post a Comment