
మాటలు రాని మనసు చేసె మౌన గారడి ఏమిటిది ఇచ్చుటె గాని పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది ఎవరేమి అన్న వినదే తనదయిన తీరు తనదే మనసంటె తియ్యని మంటేనులే… మాటలు రాని మనసు చేసె మౌన గారడి ఏమిటిది ఇచ్చుటె గాని పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది
నీవు కనులలొ ఆమె ప్రతిమను నిలుపుకున్నది నిజమా… నిన్న కలగని నేడు సెలవని ప్రేమకింతటి బలమా… చిరునవ్వు నీడలో తను కోరె వానితో జరిగె ఈ వేడుకా జరిపించై ప్రేమిక మనసంటె తియ్యని మంటేనులే… మాటలు రాని మనసు చేసె మౌన గారడి ఏమిటిది ఇచ్చుటె గాని పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది
రాని అతిదికి గుండె తలుపులు తెరిచి ఉంచిన మనసా… ఇంద్రధనసును ఎంత వలచిన చేతికందదు తెలుసా… నది వంటి ప్రేమలో ఎదురీత ఏందుకొ కథలేని పత్రలా కదిలే ఓ నేస్తమ మనసంటె తియ్యని మంటేనులే… మాటలు రాని మనసు చేసె మౌన గారడి ఏమిటిది ఇచ్చుటె గాని పొందలేని పిచ్చి ప్రేమకు సాక్ష్యమిది ఎవరేమి అన్న వినదే తనదయిన తీరు తనదే మనసంటె తియ్యని మంటేనులే…







0 comments:
Post a Comment