
నలుగురూ ఉన్నారంటావా... ఓ...
చిలిపిగా చెంతకు రాలేవా...
తెలివిగా చేరేతోవా, తెలియనే లేదా బావా,
అటు ఇటు చూస్తూ ఉంటావా... ఓ...
తటపటా ఇస్తూ ఉంటావా...
సమయం కాదంటావా, సరదా లేదంటావా,
సరసం చేదంటావా బావా...
చనువే తగదంటావా, మనవే విననంటావా,
వరసై ఇటు రమ్మంటే, నామాట మన్నించవా...
ఢోలు భాజాలా ఇలా నావెంట పడతావా
చలాకి రోజా ఆగమంటె ఆగనంటావా...
హె... ఢోలు భాజాలా ఇలా నావెంట పడతావా
చలాకి రోజా ఆగమంటె ఆగనంటావా...
కనులుంటె సొగసే కనపడదా,
మనసుంటె తగుమార్గం దొరకదా...
రాననకా... రాననకా... రాననకా...
అనుకుంటె సరిపోదే వనితా,
అటుపై ఏ పొరబాటూ జరగదా...
రమ్మనకా... రమ్మనకా... రమ్మనకా...
పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే,
తరిమిన తాపం తాళదే మదనుడి బాణం తగిలితే,
చాల్లే బడాయి, నాతో లడాయి, తగ్గించవోయీ అబ్బాయీ,
హవ్వా హవ్వాయీ, అమ్మో అమ్మాయీ, విన్నానులే... బ్రేక్ ఇట్ డౌన్!
హవ్వా హవ్వాయీ, అమ్మో అమ్మాయీ, విన్నాం కదా నీ సన్నాయీ...
హవ్వా హవ్వాయీ, అమ్మో అమ్మాయీ, విన్నాం కదా నీ సన్నాయీ...
పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా,
నలుగురూ ఉన్నారంటావా... ఓ...
చిలిపిగా చెంతకు రాలేవా...
మొహమాటం పెడతావా అతిగా,
సుకుమారం చిటికేస్తే చొరవగా...
చేరవుగా... చేరవుగా... చేరవుగా...
ఇరకాటం పెడతావే ఇదిగా,
అబలా నీ గుబులేంటే కుదురుగా...
ఆగవుగా... ఆగవుగా... ఆగవుగా...
దరశనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా,
సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా,
వరాల బాలా, వరించువేళా, తరించనంటూ తగువేలా,
నిగరమిట్టా, జిగేలనాలా, జనం చెడేలా... ఎవ్రిబాడీ!
నిగరమిట్టా, జిగేలనాలా, జనం చెడేలా జవరాలా...
నిగరమిట్టా, జిగేలనాలా, జనం చెడేలా జవరాలా...
0 comments:
Post a Comment