.jpg)
పిల్లగాలి అల్లరి వొళ్ళంత గిల్లీ నల్లమబ్బు ఉరిమేనా...
కల్లెర్రజేసి మెరుపై తరిమేనా...
ఎల్లలన్నీ కరిగీ, ఝల్లుమంటూ ఉరికీ,
మాకళ్ళలో, వాకిళ్ళలో,
వేవేల వర్ణాల వయ్యారి జానా...
అందమైన సిరివానా, ముచ్చటగా మెరిసే సమయానా...
అందరాని చంద్రుడైనా, మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా...
మౌనాల వెనకాలా, వైనాలు తెలిసేలా, గారంగ పిలిచేనా...
ఝల్లుమంటు గుండెలోనా, తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా...
హో... మౌనాల వెనకాలా, వైనాలు తెలిసేలా, గారంగ పిలిచేనా,
ఝల్లుమంటు గుండెలోనా, తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా,
ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా,
చంద్రజాలమై తారంగాల వొడిలో ఏళ్ళన్ని మురిపించగా,
తారలన్నీ తోరణాలై, వారాల ముత్యాల హారాలయ్యేనా...
చందనాలు చిలికేనా, ముంగిలిలో నందనాలు విరిసేనా...
అందరాని చంద్రుడైన మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా...
నవ్వుల్లొ హాయి రాగం, మువ్వల్లొ వాయు వేగం, ఎమైందొ ఇంత కాలం...
ఇంతమంది బ్రుందగానం, ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం...
హో... నవ్వుల్లొ హాయి రాగం, మువ్వల్లొ వాయు వేగం, ఎమైందొ ఇంత కాలం,
ఇంతమంది బ్రుందగానం, ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం,
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా,
స్వాతి ఝల్లుగా స్వరాలెన్నొ పలికే సరికొత్త రాగాలుగా,
నింగిదాకా పొంగిపోగా, హోరెత్తి పోతున్న గానాభజానా...
చెంగుమంటు ఆడేనా, చిత్రంగా జావలీలు పాడేనా...
అందరాని చంద్రుడైన, మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా...







0 comments:
Post a Comment