Widgets


అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటీ Song from Murari


అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటీ
పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటీ…
అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటీ
పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటీ…

అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ...

తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ…
తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ…

అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ...

చందామామా చందామామా కిందికి చూడమ్మా
ఈనేల మీద నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా…
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెల బోవమ్మా…

పుత్తడి బొమ్మకు పుస్థెలు కడుతూ పురుషుడి మునివేళ్ళూ
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలూ…
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలూ
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలూ…

అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా...

అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయానా
కలలకు దొరకని కల కల జంటను పదిమందీ చూడండీ
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండీ…

చందామామా చందామామా కిందికి చూడమ్మా
ఈనేల మీద నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా…
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెల బోవమ్మా…

సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు శివుని విల్లు పెళ్ళి మండపానా…
గౌరీశంకరులు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని వొళ్ళు చల్లని సమయానా…

దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా...

దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండీ
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండీ…

చందామామా చందామామా కిందికి చూడమ్మా
ఈనేల మీద నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెల బోవమ్మా…

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory