Widgets


డుం డుం డుం నటరాజు ఆడాలి, పంబరేగాలిరా Song from Murari


డుం డుం డుం నటరాజు ఆడాలి, పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి, నేల జాబిల్లిగా…
గుండెల్లొ గురి ఉంటె ఎదగాలి, తారలే కళ్ళుగా
నీమాటే నీబాటై సాగాలి, సూటి సూరీడుగా…

బామాట నుంచి భామాట దాకా నాదేనురా పై ఆటా,
ఆడితప్పనేమాటా అయ్యచూపినా బాటా,
నమ్మినొళ్ళకిస్తా నా ప్రాణం...

డుము డుము డుము నటరాజు ఆడాలి, పంబరేగాలిరా…
జెండాపై కపిరాజు ఎగరాలి, నేల జాబిల్లిగా...

అల్లూరి దెబ్బా తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా...

అల్లూరి దెబ్బా తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా,
బ్రహ్మన్న పుత్రా హేబాలచంద్రా చెయ్యెత్తి జైకొట్టరా…
పొగరున్న కొండా వెలుగున్న మంటా తెలుగోడివనిపించరా,
వేసంగిలోనా పూసేటి మల్లీ నీమనసు కావాలిరా…

అరె వెలిగించరా లోనిదీపం, తొలగించరా బుద్దిలోపం…
ఓహొ ఆత్మేరా నీజన్మ తారా, సాటి మనిషేరా నీ పరమాత్మా...

డుము డుము డుము నటరాజు ఆడాలి, పంబరేగాలిరా…
జెండాపై కపిరాజు ఎగరాలి, నేల జాబిల్లిగా గా గా గా...

చూపుంటె కంట్లో ఊపుంటె ఒంట్లో నీకెంటి ఎదురంటా...

చూపుంటె కంట్లో ఊపుంటె ఒంట్లో నీకెంటి ఎదురంటా,
నీవు నీకు తెలిసేలా నిన్ను నీవు గెలిచేలా,
మారచాలిరా మన గీత…
చిగురంత వలపో చిలకమ్మ పిలుపో,
గుణపాటం ఉండాలిరా…
పెదవుల్లో చలి ఏలా పెనవేస్తే చెలి గోలా,
చెలగాటం ఆడాలిరా…
అహ మారిందిరా పాతకాలం,
నిండు మనసొక్కటే నీకు మార్గం...

డుం డుం డుం నటరాజు ఆడాలి, పంబరేగాలిరా…
జండాపై కపిరాజు ఎగరాలి, నేల జాబిల్లిగా...

బామాట నుంచి భామాట దాకా నాదేనురా పై ఆటా,
ఆడితప్పనేమాటా అయ్యచూపినా బాటా,
నమ్మినొళ్ళకిస్తా నా ప్రాణం...

డుము డుము డుము నటరాజు ఆడాలి, పంబరేగాలిరా…
జండాపై కపిరాజు ఎగరాలి, నేల జాబిల్లిగా…
డుము డుము డుము నటరాజు ఆడాలి, పంబరేగాలిరా…
జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా...

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory