Widgets


అదరదరదరగొట్టు ఢోలు భాజాల బీటు Song from Dookudu

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలందీ మా ఇంటి పెళ్ళీకళా
దిల్సే దిల్ ముడి వేసేయ్ మందీ వారే వీరైపోయేలా
కలలే కలిపిన అనుబంధంగా
ఇలలో ఇపుడే శుముహుర్తంగా
ఎదురయ్యింది చల్లనివేళా కళ్యానలీలా...

అదరదరదరగొట్టు ఢోలు భాజాల బీటు
ఊరువుయ్యాలూగేట్టు మోత మోగించేయ్ ట్రంపెట్టూ
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ...

ఆరె ఆరే అదరదరదరగొట్టు
ఇదివరకిలాంటి పెళ్ళి లేనట్టూ
హే మగపెళ్ళివారమంతా వాలిపోయాం విడిదింటా
పనిలో పని పల్లికీనీ మోసుకొచ్చేసామాంటా
మనువాడీ శ్రీమాలక్ష్మిని తీసుకెళతాం మావెంటా

ఆలస్యం దేనికింకా తాళిబొట్టూ కట్టేస్తా
పప్పర పప్ప పారా రా రా
పప్పర పప్ప పారా రా రా
అత్తింటి కోడలీని వేలు పట్టీ వచ్చేస్తా
పప్పర పప్ప పారా రా రా

అదరదరదరగొట్టు ఢోలు భాజాల బీటు
ఊరువుయ్యాలూగేట్టు మోత మోగించేయ్ ట్రంపెట్టూ
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ...

హే పిల్లేమొ ఎరుపు బంగారం కలగలుపూ
పిల్లొడె కట్నం ఇచ్చుకోక తప్పదూ
హే హే మావాడు మెరుపు పోటీలేనీ గెలుపూ
స్విస్ బ్యాంకే రాసి ఇచ్చుకున్న చాలదూ...

హే వజ్రంలాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరూ
తన అద్రుష్టంతో కలిసొస్తాయి అన్నీ లాంచనాలూ
హే చూసేస్తున్నాడే వరుడు లగ్గమెప్పుడన్నట్టూ
మాటే అడిగిస్తుంది పిల్ల బుగ్గల్లో బొట్టూ
తాపీగా ఉన్నారేంటీ తొందర గిందర లేనట్టూ

ఆలస్యం దేనికింకా తాళిబొట్టూ కట్టేస్తా...

హే భూలోకమంతా వెతికిచూసుకున్నా
ఇట్టాంటి అమ్మడూ మీకు దక్కదూ
హే నీ కంటి పాప కోరి చేరుకున్నా
వీరాధివీరుడూ మా నిండు చంద్రుడూ

హే అన్నీ తానై ఉన్నోడు దేవుడులాంటీ నాన్నా
నేకోరే వరమే లేదంటా తన సంతోషంకన్నా
అలనాటీ రామచంద్రుడు నీలాగే ఉండుంటాడూ
చిన్నారీ జానకి సీతకు చెయ్యందించీ పెళ్ళాడూ
నీకన్నా తండ్రి కంట్లో వెలిగే ఆనందం చూడూ...

ఆలస్యం దేనికింకా తాళిబొట్టూ కట్టేస్తా


పప్పర పప్ప పారా రా రా
పప్పర పప్ప పారా రా రా
అత్తింటి కోడలీని వేలు పట్టీ వచ్చేస్తా
పప్పర పప్ప పారా రా రా

అదరదరదరగొట్టు ఢోలు భాజాల బీటు
ఊరువుయ్యాలూగేట్టు మోత మోగించేయ్ ట్రంపెట్టూ
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ...
To listen this song click on play button
                                               

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory