Widgets


అవును నిజం నువ్వంటె నాకిష్టం Song from Athadu

అవును నిజం నువ్వంటె నాకిష్టం
నిమిషం గుర్తించావ్ సత్యం
చలి పరదా... ఇక నిలవదుగా,
ఉవ్వా ఉవ్వా ఉవ్వా ఉవ్వావు...
తెలుసుకదా... ,
ఉవ్వా ఉవ్వా ఉవ్వా ఉవ్వావు...

తెలిసిందే అడగాలా...
అడగందే అనవేలా...
చెవిలో ఇలా చెబితే చాలా...

అవును నిజం నువ్వంటె నాకిష్టం
నిమిషం గుర్తించావ్ సత్యం...

కసిరేస్తున్నా... మనసుకు వినపడదో ఏమో,
విసిరేస్తున్నా... నినువిడి వెనకకి రాదేమో,
నిదరోతున్నా... ఎదురై కనపడతావేమో,
కదలాలన్నా... కుదరని మెలి పెడతావేమో,

అంతగా... కంట చూడనని మొండికేస్తే తప్పేమో,
ఒంటిగా... ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో,
మన సలహా మది వినదుకదా,
ఉవ్వా ఉవ్వా ఉవ్వా ఉవ్వావు...
తెలుసుకదా ,
ఉవ్వా ఉవ్వా ఉవ్వా ఉవ్వావు...
తెలిసే ఈలా చెలరేగాలా...

అవును నిజం నువ్వంటె నాకిష్టం
నిమిషం గుర్తించావ్ సత్యం...

సుడిగాలిలో... తెలియని పరుగులు తీస్తున్నా,
జడపూలతో... చెలిమికి సమయము దొరికేనా,
ఎదరేముందో... తమరిని వివరములడిగానా,
ఎద ఏమందో... వినమని తరుముకు రాలేనా,

తప్పుకో... కళ్ళుమూసుకుని తుళ్ళి రాకే నావెంటా,
ఒప్పుకో... నిన్ను నమ్మమని అల్లుకుంటా నీజంటా,
నడపదుగా నిను నది వరదా,
ఉవ్వా ఉవ్వా ఉవ్వా ఉవ్వావు...
తెలుసుకదా ,
ఉవ్వా ఉవ్వా ఉవ్వా ఉవ్వావు...
తెలిసే ఈలా ముంచెయ్యాలా...

అవును నిజం నువ్వంటె నాకిష్టం
నిమిషం గుర్తించావ్ సత్యం
చలి పరదా... ఇక నిలవదుగా,
ఉవ్వా ఉవ్వా ఉవ్వా ఉవ్వావు...
తెలుసుకదా... ,
ఉవ్వా ఉవ్వా ఉవ్వా ఉవ్వావు...

తెలిసిందే అడగాలా...
అడగందే అనవేలా...
చెవిలో ఇలా చెబితే చాలా...

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory