Widgets


నీతో చెప్పనా, నీక్కూడా తెలిసినా, Song from Athadu

నీతో చెప్పనా, నీక్కూడా తెలిసినా,
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా...

గారం చేసినా, నయగారం చూపినా,
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా...
నేనే నేనుగా... లేనే లేనుగా ...
నా కన్నులా... నీదే వెన్నెలా హో హో హో...

నీతో చెప్పనా, నీక్కూడా తెలిసినా,
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా...

ఇంకొంచెం అనుకున్నా, ఇకచాల్లే అన్నానా,
వదలమంటె ఏమిటర్ధం, వదిలి పొమ్మనా...
పనిమాలా పైపైనా, పడతావేం పసికూనా,
ముద్దు మీరుతున్న పంతం, హద్దులోనె ఆపనా...
మగువ మనసు తెలిసేనా, మగజాతికీ...
మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికీ... కూత దేనికీ...

గారం చేసినా, నయగారం చూపినా,
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా...

ఒదిగున్నా ఒరలోనా, కదిలించకె కుర్రదానా,
కత్తిసాముతో ప్రమాదం, పట్టు జారెనా...
పెదవోపని పదునైనా, పరవాలేదనుకోనా,
కొత్త ప్రేమలో వినోదం, నీకు నేను నేర్పనా...
సొంత సొగసు బరువేనా, సుకుమారికీ...
అంత బిరుసు పరువేనా, రాకుమారుడంటి నీ... రాజసానికీ...

గారం చేసినా, నయగారం చూపినా,
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా...
నేనే నేనుగా... లేనే లేనుగా ...
హో... నా కన్నులా... నీదే వెన్నెలా హో హో హో...

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory